రెక్కాడితేనే.. డొక్క నిండేది! | - | Sakshi
Sakshi News home page

రెక్కాడితేనే.. డొక్క నిండేది!

Jan 2 2026 12:26 PM | Updated on Jan 2 2026 12:26 PM

రెక్క

రెక్కాడితేనే.. డొక్క నిండేది!

రెక్కాడితేనే.. డొక్క నిండేది! ఇరవై ఏళ్లుగా.. కష్టమైనా తప్పదు

వ్యవసాయ పనిముట్ల తయారీలో వలస జీవులు

కొలిమిని నమ్ముకొని సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు రాక

కుటుంబంతో కలిసి ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, కవిటి ప్రాంతాలకు వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. మేము తయారు చేసిన పనిముట్లు ఎవరైనా కొంటేనే మా పొట్ట నిండేది. రోజంతా పనిచేస్తే వచ్చేది చాలా తక్కు వ. వేరే పనులు చేయలేక ఈ పనితోనే నెట్టుకొస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి

– ఛత్రసింగ్‌, ఇచ్ఛాపురం

కొలిమి పనులు చేసేటప్పు డు, సమ్మెట దెబ్బ వేసేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. అయినా తప్పడం లేదు. చేసిన పని ము ట్లు అమ్ముతాం. ఒక్కోసారి డబ్బులు సరిగా రా వు. అయినా పొట్ట కూటి కోసం తిప్పలు పడుతున్నాం. – నరేంద్ర సింగ్‌, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం రూరల్‌ :

ప్రదేశం ఎక్కడైనా కష్టపడే తత్వం వారి సొంతం. కొలిమి వృత్తిని నమ్ముకుంటూ పుట్టిన ఊరును వదిలి బతుకుదెరువు కోసం వలస బాటపట్టారు. రెక్కల కష్టమే బతుకుదెరువుగా మార్చుకున్నారు. ఇంటిల్లపాదీ పొద్దంతా పనిచేసి కడుపు నింపుకుంటున్నారు. రోడ్ల వెంట గుడారాలు వేసుకొని, మండుతున్న కొలిమిలో ఇనుము కాలుస్తూ, సమ్మెట దెబ్బలు వేస్తూ చిన్నచిన్న పనిముట్లు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు కొన్నేళ్ల క్రితం జిల్లాకు వచ్చి గ్రామాల్లో సంచరిస్తూ కొలిమి పనులు చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు.

అందరూ కష్టపడితేనే..

పనిముట్లు తయారు చేసే క్రమంలో పురుషులు ఇనుమును కొలిమిలో కాల్చి బయటకు తీసినప్పుడు మహిళలు సమ్మెట దెబ్బలు వేయల్సి వస్తుంది. బరువైన పెద్ద సుత్తితో వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కానీ బతుకుదెరువు కోసం తప్పని పరిస్థితి. కొలిమి పనుల్లో వచ్చే పొగ, సెగతో ఆరోగ్యం క్షీణించిపోతోంది.

ఎండైనా..వానైనా..

కొలిమి పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్న కార్మికుల భవితాలు దుర్భరంగా మారాయి. వారికి చిన్నచిన్న గుడారాలే ఇళ్లు. ఎండైనా, వానైనా కుటుంబం అంతా వాటిలో ఉండాల్సిందే. రోడ్డు పక్కనే జీవనం, కనీస సదుపాయాలు కరువయ్యాయి. ప్రస్తు తం చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. వారి పిల్లల చదువులు, ఆరోగ్యం అంతంత మాత్ర మే. ఊరుకాని ఊరు వచ్చి వారు అనేక కష్టాల నడు మ జీవనం సాగిస్తున్నామని, పాలకులు, ప్రభు త్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

రెక్కాడితేనే.. డొక్క నిండేది! 1
1/3

రెక్కాడితేనే.. డొక్క నిండేది!

రెక్కాడితేనే.. డొక్క నిండేది! 2
2/3

రెక్కాడితేనే.. డొక్క నిండేది!

రెక్కాడితేనే.. డొక్క నిండేది! 3
3/3

రెక్కాడితేనే.. డొక్క నిండేది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement