సముద్రంలో బోటు మునక
● లక్షల్లో ఆస్తినష్టం
కొత్తపాలెంలో వలల్ని తీస్తున్న మత్స్యకారులు
కవిటి : మండలంలోని కొత్తపాలెం సముద్రతీరంలో లంగరువేసిన గంగామాత అనే బోటు సము ద్రంలో కూరుకుపోయిందని బోటుకు చెందిన 11 మంది మత్స్యకారులు డొంక సోమయ్య, సూర్ని లచ్చయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం సాయంత్రం మత్స్యకారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు..
బుధవారం వేట నుంచి వచ్చిన తర్వాత కొత్త పాలెం సముద్ర తీరంలో లంగరు వేసి బోటు సురక్షితంగానే నిలిపారు. గురువారం ఉదయం వేటకు వెళదామని అంతా తీరానికి వెళ్లారు. చూసేసరికి బోటు సముద్రంలో భారీగా కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో దానిలో ఉన్న లక్షల రూపాయల విలువైన వల కూడా పాడైపోయింది. బోటును మరికొన్ని బోట్ల సాయంతో బయటకు తీసేందుకు గ్రామస్తులంతా శతవిధాలుగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అది ముక్కలుగా విరిగి బాగా దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో బోటులో రెండు జీపీఎస్ మిషన్లు, ఇంజిన్లలో ఉన్న ఇంజిన్ ఆయిల్ పడిపోయింది. బోటులో ఉన్న టీవీ కూడా దెబ్బతింది. జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయ త్నించామని మత్స్యకారులు తెలిపారు. వలతో పాటు బోటు కూడా పాడైపోయిందని లక్షల్లో నష్టపోయామని తెలిపారు. కొత్తబోటు కొనాలంటే ప్రస్తుతం రూ.16 నుంచి రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది. జీపీఎస్ మిషన్లు, టీవీ తదితర సౌకర్యా లు అన్నీ సమకూర్చడం ఇప్పుడు తమకు తలకు మించిన భారమని మత్స్యకారులు వాపో తున్నా రు. అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
సముద్రంలో బోటు మునక


