సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర సంధ్య వేళల్లో సిక్కోలు బాట రక్తంతో తడుస్తోంది. 2025 అంతా ఇదే తీరు. చిరు చీకట్లు కమ్ముకుంటున్న సమయాల్లో జరుగుతున్న ప్రమాదాలు చాలా కుటుంబాల్లో చీకట్లను మిగిల్చాయి. తప్పతాగి ఒకరు, మితిమీరిన వేగంతో మరొకర | - | Sakshi
Sakshi News home page

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర సంధ్య వేళల్లో సిక్కోలు బాట రక్తంతో తడుస్తోంది. 2025 అంతా ఇదే తీరు. చిరు చీకట్లు కమ్ముకుంటున్న సమయాల్లో జరుగుతున్న ప్రమాదాలు చాలా కుటుంబాల్లో చీకట్లను మిగిల్చాయి. తప్పతాగి ఒకరు, మితిమీరిన వేగంతో మరొకర

Dec 28 2025 7:30 AM | Updated on Dec 28 2025 7:30 AM

సాయంత

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

●బ్లాక్‌ స్పాట్లు గుర్తించాం..

పట్టని నిబంధనలు

ఏడాదంతా రక్తమోడిన రహదారులు

ప్రమాదాలు ఎందుకంటే..

ఈ ఏడాదిలో ప్రమాదాల్లో కొన్ని

బ్లాక్‌స్పాట్లు గుర్తించి ప్రమాద నివారణకు చర్యలు చేపడుతున్నాం. గత ఏడాది 889 ప్రమాదాలు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికి 699 జరిగాయి. ఘోర ప్రమాదాల సంఖ్య తగ్గింది, కానీ ప్రమా దాల్లో గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్లు ధరించకపోవడం వలనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

– కలెక్టరేట్‌లో సమీక్షలో ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైమ్‌ :

జిల్లాలోని రహదారులు రక్తమోడాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 699 ప్రమా దాలు జరిగాయి. లెక్కల్లోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు మూ డొందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లినవారే అధికంగా మరణించారు. అది కూడా ఎక్కువగా సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్యన మరణించారు.

రానున్నది పండగల సీజన్‌. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదని పోలీసులు సూచిస్తున్నారు. పండగ కోసం ఊళ్లకు వెళ్లే వాళ్లు నిబంధనలు పాటించాలని, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

●చాలాచోట్ల హైవే రోడ్లపై ఇసుక, గ్రావెల్‌ చెల్లాచెదురై ఉంది. గ్రామీణ రహదారుల్లో మరింత దారుణం. గోతులు, ఇరువైపులా పొదలుండి ఎదురుగా వస్తున్నవారు కనిపించడం లేదు.

●హైవే వెంబడి ఫ్లై ఓవర్లలో కొన్ని చోట్ల లైట్లు వెలగడం లేదు. వాహన వేగాన్ని సూచించే స్పీడోమీటర్లు కొన్ని పనిచేయడం లేదు. పీపీటీ కెమెరాలు కూడా మరమ్మతులో ఉన్నాయి.

●షార్ట్‌కట్‌ యూటర్న్‌ల కోసం ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం హైవే వరకు చాలాచోట్ల డివైడర్లను తవ్వి మార్గాలను చేసి ఉన్నారు. కొన్ని చోట్ల రోడ్లపైనే కాంక్రీట్‌ దిమ్మలు వదిలేసి ఉన్నారు. ఇవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

●నో పార్కింగ్‌ జోన్లలో భారీ వాహనాలను నిలుపుదల చేయకుండా, నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్‌ పెట్టుకునేలా చేయడంలో హైవే మొబైల్‌ పెట్రోలింగ్‌ పోలీసులు ఇప్పటికీ విఫలమవుతున్నారు.

●ప్రమాదకర మలుపుల్లో ఇంకా బారికేడ్లను అమర్చలేదు. రణస్థలం హైవేలో ఇటీవల అలానే గుంతలో పడి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ప్రమాద ప్రోన్‌ జోన్లలో గ్లోసైన్‌బోర్డులు, స్పీడ్‌ లిమిట్‌బోర్డులు, జీబ్రాక్రాసింగ్‌ గుర్తులు కొన్ని ప్రాంతాల్లో లేవు.

●ముఖ్య పట్టణాల్లో, కేంద్రాల్లో అడ్డదిడ్డంగా మలుపులు తిప్పేయడం, రోడ్ల మధ్యనే ఆటోవాలాలు అకస్మాత్తుగా ఆపేయడం, నిర్ణీత ప్రదేశాల్లో కాకుండా రద్దీ ప్రదేశాల్లో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ర్యాష్‌ డ్రైవ్‌ చేయడం, సడెన్‌గా ఆపేయడం ప్రమాదాలకు తావిస్తున్నాయి.

●హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, ర్యాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌రైడింగ్‌, మైనర్‌ రైడింగ్‌, షార్ట్‌కట్‌ రూట్‌ల ను ఆశ్రయించడం, అవసరం లేకపోయినా రాత్రి ప్రయాణాలు చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు క్రాస్‌ చేసేటప్పుడు వాహనాలను పరిశీలించకపోవడం వంటి చిన్నపాటి నిర్లక్ష్యాలతోనే ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

ఈ ఏడాది మార్చి 3న జిల్లాకేంద్రంలోని డేఅండ్‌నైట్‌ కూడలి సమీప నాగావళి వంతెనపై ఆర్టీసీ బస్సు నిండు గర్భిణిని ఢీకొట్టి వెళ్లిపోయింది. చక్రాల కింద గర్భిణి నలిగిపోయింది.

మార్చి 15న లావేరు మండలం బుడుమూరు సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో పాతపట్నం పెద్దలోడికి చెందిన నలుగురు చనిపోయారు.

కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్‌ వ్యాన్‌ ఢీకొనడంతో మధ్య ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర1
1/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర2
2/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర3
3/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర4
4/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర5
5/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర6
6/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర7
7/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర8
8/8

సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement