ఆశ్రమ పాఠశాలలో దాడిపై విచారణ
మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై పీఈటీ భర్త దాడి చేసిన ఘటనపై శనివారం ఆశ్రమ పాఠశాలలో ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.మల్లేశ్వరరావు విచారణ చేపట్టారు. పీఈటీ కల్యాణితో పాటు విద్యార్థిని తల్లి, పాఠశాల సిబ్బందిని విచారించారు. దీనిపై ఆయన మా ట్లాడుతూ కమిషన్ చైర్మన్‌కు నివేదిస్తామని తెలిపా రు. అనంతరం మండల గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సవర వెంకటేష్ ఆయనకు ఫిర్యాదు చేశా రు. పాఠశాలతో సంబంధం లేనివ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించడమే కాకుండా విద్యార్థినిపై దాడి చేయ డం సమంజసం కాదని, అతనిని తక్షణమే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయా లని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి, కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలని దళిత గిరిజన సంఘాల నాయ కులు బోకర నారాయణరావు, చౌదరి లక్ష్మీనారాయణ కోరారు. పీఈటీ కల్యాణిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.


