జనవరి 4న చలో విశాఖ | - | Sakshi
Sakshi News home page

జనవరి 4న చలో విశాఖ

Dec 28 2025 7:30 AM | Updated on Dec 28 2025 7:30 AM

జనవరి

జనవరి 4న చలో విశాఖ

జనవరి 4న చలో విశాఖ జాతీయ క్రికెట్‌ పోటీలకు కోచ్‌, మేనేజర్లుగా సిక్కోలు వాసులు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు హెచ్‌ఓడీగా లోకేష్‌ మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్‌

రణస్థలం: జనవరి 4న చలో విశాఖపట్నం జయప్రదం చేయాలని ఏపీ ఆశ వర్కర్స్‌ యూ నియన్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.నాగమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్‌ అమ్మన్నాయుడు పిలుపు నిచ్చారు. ఆశ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం శనివారం కోష్టలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2025 డిసెంబర్‌ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ అంబేడ్కర్‌ విగ్ర హం నుంచి ప్రదర్శన అనంతరం మున్సిపల్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభ లో ఆశాలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆశ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని, వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలని డి మాండ్‌ చేశారు. సెలవు లేకుండా ఆశ వర్కర్లు పని చేస్తున్నారని, ఆశ వర్కర్ల సమస్యలు పరి ష్కరించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి. లీలావతి, నాయకులు పి. రాజా, సుభద్ర, పైడి లక్ష్మీ పాల్గొన్నారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: 69వ ఆలిండియా స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 బాలికల క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు కోచ్‌, మేనేజర్లుగా శ్రీకాకుళం జిల్లా వాసులకు అవకాశం లభించింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని శివపురి వేదికగా జనవరి 1 నుంచి 6 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలికల క్రికెట్‌ జట్టు కోచ్‌, మేనేజర్లగా జిల్లాకు చెందిన ముగ్గురు ఫిజికల్‌ డైరెక్టర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి నియామక ఉత్తర్వులు అందు కున్నారు. నియామకమైన వారిలో వాన దివ్య (పీడీ– జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కృష్ణాపురం, మందస మండలం), బేరి లోకేశ్వరరావు (పీడీ– ఏపీ మోడల్‌ స్కూల్‌ పాతపట్నం), నెయ్యిల అనంత్‌రాజు (పీడీ– జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నీలంపేట) ఉన్నారు. డిసెంబర్‌ 29న ఏపీ రాష్ట్ర జట్టుతో కలిసి మధ్యప్రదేశ్‌ పయనమై వెళ్తున్నారు.

పాతపట్నం: జాతీయ స్థా యి స్కూల్‌గేమ్స్‌ అండర్‌– 19 బాలికల క్రికెట్‌ పోటీల కు పాతపట్నం ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో పీడీగా పనిచేస్తున్న బేరి లోకేష్‌కు జాతీయ బాలికల క్రికెట్‌ హెచ్‌ఓడీగా ఎంపికయ్యారని ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కేవీ రత్నకుమారి శనివారం తెలిపారు. లోకేష్‌ను రాష్ట్ర వ్యాయా మ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్‌బాబు, ఎంఈఓ సీహెచ్‌ తిరుమలరావు,పీఈటీలు జన్ని కృష్ణ, సిమ్మ కృష్ణారావు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు అభినందించారు.

టెక్కలి రూరల్‌: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో శనివారం ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై పడి వారిని పట్టుకునేందుకు ప్రయ త్నించాడు. అక్కడే ఉన్న కొంత మంది వ్యక్తులు ప్రశ్నించడంతో వారిని నానా మాట లు అన్నాడు. దీంతో కొందరు అతడిని పట్టు కుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని టెక్కలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జనవరి 4న చలో విశాఖ 1
1/1

జనవరి 4న చలో విశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement