నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు..?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు కల్పిస్తారని, ఈ ఏడాది జనవరిలోనైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ నుంచి సూర్య మహల్ జంక్షన్ వరకు నిరసన, భిక్షాటన కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. జనవరి ఒకటికై నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివరాజు, ఏఐవైఎఫ్ నాయకులు అమోస్, అన్నాజీ, వసంత్, జగదీశ్, సూర్య, వేణు తదితరులు పాల్గొన్నారు.


