కూర్మనాథుని సన్నిధిలో న్యాయమూర్తులు
గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని విశాఖపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.సన్యాసినాయుడు శనివారం ఉదయం దర్శించుకున్నారు. అదేవిధంగా జిల్లా నాలుగో అదనపు సెషన్సు న్యాయమూర్తి ఎస్.కవిత కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. వేర్వేరుగా వచ్చిన న్యాయమూర్తులకు అధికారులు ఎదురేగి స్వాగతం పలికి, అంతరాలయంలో మూలవిరాట్ వద్ద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహాత్యాన్ని తెలియజేయగా, కార్యాలయ సూపరింటెండెంట్ నర్సుబాబు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కూర్మనాథుని సన్నిధిలో న్యాయమూర్తులు


