జనవరి 6లోగా వివరాలు నమోదు చేసుకోవాలి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి రూ.లక్ష లేదా అంతకుమించి విలువైన పనులు, విరాళాలు సమర్పించిన దాతలు వచ్చే ఏడాది జనవరి 6వ తేదీలోగా ప్రత్యేకంగా తమ వివరాలను ఆధార్‌కార్డుతో సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. దాతలు స్వయంగా లేదా వారికి చెందిన వ్యక్తులను ఆలయానికి పంపించి తమ వివరాలను నమో దు చేయించుకోవాలన్నారు. లేదంటే 63026 79236, 89789 14660, 73820 25550 నంబర్లకు వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డులు, విరా ళ రశీదును పంపిస్తే ఆలయ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు.
ఎచ్చెర్ల: మండలంలోని చిలకపాలేం జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒడిశా నుంచి బెంగుళూరు వెళ్తున్న ఒక కారు బోల్తా పడడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగుళూరు (కర్ణాటక) బాట్రాపురానికి చెందిన ఎన్.నవీన్ తన మిత్రులతో కలిసి ఒడిశాలోని ఆలయాల సందర్శనకు కారులో వెళ్లాడు. అనంతరం తిరిగి బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చిలకపాలేం వద్ద కారు వెనుక టైరు పేలడంతో డివైడర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ అర్జున్(27) తీవ్రంగా గాయపడడంతో.. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో డ్రైవర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని శివశంకర్ కాలనీ కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన ఆనెం త్రినాథరావు (74) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. మృతుడు శివశంకర్ కాలనీ కూడలి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో పాతపట్నం నుంచి కొరసవాడ వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పాతపట్నం సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. త్రినాథరావుకు భార్య ఆనెం శకుంతల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇచ్ఛాపురం రూరల్: జాతీయ రహదారిపై వెళ్తున్న గొర్రెలను లారీ ఢీకొనడంతో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గుడ్డిభద్ర కొజ్జిరియాకు చెందిన దుర్గాశి శేఖరం తన గొర్రెలను శనివారం స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో సోంపేట నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు బలరాంపురం జంక్షన్ వద్ద ఢీకొనడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో నాలుగు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ ఏదురు మోహనరావు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నర్తు ప్రేమ్‌కుమార్, నాయకుడు దట్టి అజయ్, మురపాల ధర్మా, కర్రి పొట్టయ్యలు లారీ డ్రైవర్‌తో మాట్లాడి బాధితుడికి రూ.80 వేల నష్ట పరిహారం ఇప్పించారు.
జనవరి 6లోగా వివరాలు నమోదు చేసుకోవాలి
జనవరి 6లోగా వివరాలు నమోదు చేసుకోవాలి


