●డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యమే ముద్దు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను(ఓజేటీ) జిల్లా ఇంటర్మీడియెట్ వృత్తి విద్యాశాఖ అధికారి రేగ సురేష్ కుమార్ పరిశీలించారు. శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రాండ్ కన్వెన్షన్‌లో జరుగుతున్న క్షేత్రస్థాయి శిక్షణను శనివారం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గివలస రామ్‌ప్రసాద్‌తో కలిసి డీవీఈఓ సురేష్‌కుమార్ పరిశీలించారు. విద్యార్థులు తయారుచేసిన రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఓజేటీ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. పోలాకి కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతు పద్మలత మాట్లాడుతు లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యార్థులకు ఓజేటీ మేలు చేస్తుందని, భవిష్యత్‌లో ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నెలరోజుల ఓజేటీలో భాగంగా క్షేత్ర స్థాయి శిక్షణకు విద్యార్థులను తీసుకువచ్చినట్టు అధ్యాపకులు బీఎల్‌వి నరసింహారావు, కాయ రవీంద్ర తెలిపారు.
●డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యమే ముద్దు


