ముప్పు!
అవగాహన కల్పిస్తున్నాం
నిప్పు..
● పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.
● పంటకోత పూర్తయిన తర్వాత మిగిలిన అవశేషాలను భూమిలో మురగబెట్టి దుక్కిలో కలిపిదున్నాలి. ఇలా చేస్తే వరి గడ్డి భూమిలో మురిగి సేంద్రియ కర్బనం పెరుగుతుంది.
● తర్వాత దశలో సాగుచేసే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, సూపర్‌పాస్ఫేట్, పొటాష్‌లను కలిపి పంట సాగు చేసుకొనే ముందు చల్లితే పొలంలో మిగిలిన కొయ్యలు, వరి గడ్డి రెండు వారాల్లోనే మురుగుతాయి.
● వరి కోతలు అనంతరం కొయ్య, గడ్డి దహనం
● భూసారంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న శాస్త్రవేత్తలు
భూసారానికి
హిరమండలం: కొనేళ్ల కిందట వరి కోతల అనంతరం గడ్డిని కుప్పలుగా వేసి పశువుల మేతకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల కొరత, సమయాభావం, వాతావరణ పరిస్థితులు తదితర కారణంతో కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలతో పాటు గడ్డికి కొందరు రైతులు పొలంలోనే నిప్పంటిస్తున్నారు. అవగాహన లోపంతో అన్నదాతలు ఇలా చేయడం వల్ల భూసారానికి ముప్పు పొంచి తప్పదని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంతో భవిష్యత్తులో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాదని చెబుతున్నారు. పంటలకు కీడుచేసే పురుగులను తినే వానపాములు, కీటకాలు నశించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భూమికి సేంద్రియ పీచు పదార్థాలుగా ఉపయోగపడే అవశేషాలు ఖనిజ, లవణాలు నశిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో ఎక్కువ మొత్తంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని చెబుతున్నారు.
పంట భూముల్లో గడ్డి, వరి కొయ్యలను దహనం చేస్తే భూసారం కోల్పోతుంది. అవసరం లేని గడ్డిని భూమిలోనే కలిపి దున్నితే సేంద్రియ ఎరువుగా మారి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. గడ్డి, కొయ్యల దహనంతో వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– బి.సంధ్య, మండల వ్యవసాయాధికారి, హిరమండలం
ముప్పు!
ముప్పు!


