అధిక సంఖ్యలో వినతులు.. అయిన వారికే పరిష్కారాలు
● 22ఎ సమస్య వినతుల స్వీకరణ
అంతా గందరగోళం
● మూడంచెల పోలీస్ చెకింగ్‌లతో రైతులు ఇబ్బందులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: భూ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘22ఏ భూస్వేచ్ఛ మీ చేతికి మీ భూమి’ ప్రత్యేక డ్రైవ్ గందరగోళంగా మారింది. రైతులు ఎవరికి సమస్యలు విన్నవించా లో తెలీని పరిస్థితి నెలకొంది. అధికారులు ఊహించని దాని కంటే అధికంగా రైతులు రావడంతో జెడ్పీ ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయింది. కొందరికై తే కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా దక్కలేదు.
● రెవెన్యూ డివిజన్ల వారీగా వినతులు తీసుకునేందుకు ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడకు చేరాలంటేనే ఇబ్బంది పడాల్సిన పరి స్థితి నెలకొంది. ప్రధాన గేటు నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నారు. వారికి సమాధానం చెప్పుకుంటూ రావడం రైతులకు సమస్యగా మారింది.
● అక్కడి నుంచి డివిజన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్తే సిబ్బంది దరఖాస్తు పరిశీలించి సమావేశ మందిరంలోకి పంపించాలి. అక్కడా పోలీసులతో ఇబ్బందులు తప్పలేదు. అంతా దాటుకుని వెళితే 22ఎ సమస్యలను ఉదయం అధికారులు, మంత్రి పరిశీలించలేదు. వాటిని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అవస్థలు పడ్డారు.
● ముందుగా సాధారణ భూ సమస్యలను పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా అయిన వారి సమస్యలు పరిష్కరించాలనే తాపత్రయమే కనిపించింది. ఎక్కువగా నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం నియోజకవర్గవాల వారి దరఖాస్తులే పరిశీలించారు. దీంతో ఈ పరిష్కార వేదిక టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు బంధువుల భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినట్టు మారింది.
● 22ఎ సమస్యలకు సంబంధించి జేసీ, ఆర్డీఓ కోర్టులో సుమారుగా 121 ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పాతవాటిని పరిష్కరించి ఈ గ్రీవెన్స్ విజయవంతమైందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
● ఫిర్యాదుల స్వీకరణపై రైతులకు సంతృప్తి లేదు. నరసన్నపేటకు సంబంధించి భూముల పరిష్కరించాలని ప్రత్యేకంగా కలెక్టర్‌కు మంత్రి చెప్ప డం అందులో కొంతభాగం ఎమ్మెల్యే తాలూకా భూములు ఉన్నాయని, వాటిని ఇక్కడికిక్కడే పరిష్కరించాలని మంత్రి ఆదేశించడం విశేషం.
● కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, 30 మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల సెక్షన్ అధికారులు, 22 ఏ బాధిత దరఖాస్తు దారులు ఉన్నారు.
‘22ఎ నుంచి స్వేచ్ఛ కల్పిస్తున్నాం’
అరసవల్లి: జిల్లాలో గత కొన్నేళ్లుగా వివిధ కార ణాలతో పలువురి భూములు నిషేధిత భూముల జాబితా (22–ఎ రిజిస్టర్)లో చేరిపోయాయని, అలాంటి బాధితుల భూములను స్వేచ్ఛగా వారికే అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కె.అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈమేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మీ చేతికి మీ భూమి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు.
అధిక సంఖ్యలో వినతులు.. అయిన వారికే పరిష్కారాలు


