చలి.. రోగాల కౌగిలి
● శీతల గాలుల ప్రభావంతో
అనారోగ్య సమస్యలు
● గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో
బాధ పడుతున్న వైనం
● పెయిన్ కిల్లర్స్,
హై యాంటీబయోటిక్స్ జోలికి వెళ్లొద్దంటున్న వైద్యులు
టెక్కలి: చల్లటి గాలులు అనారోగ్యాలను తెచ్చి పెడుతున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతమైన మంచు కురవడంతో పాటు పట్ట పగలు సైతం సూర్యుడి ప్రభావం కనిపించని పరిస్థితులు ఉన్నా యి. శీతల గాలుల ప్రభావంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు మంచు ప్రభావం, మరో వైపు వాతావరణ కాలుష్యం ప్రభావం అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గొంతు గర గర సమస్యతో పాటు శరీర నొప్పులతో బాధ పడుతున్నా రు. అయితే శాసీ్త్రయ పద్ధతులు పాటిస్తూ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజులు దాటి ఆయా సమస్యలు వేధిస్తుంటే కచ్చితంగా సంబంధిత వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులను వినియోగించడం మేలని చెబుతున్నారు. సొంత వైద్యంతో మందుల వినియోగం, హై డోస్ యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ వంటి మందులు వాడితే ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
సొంత వైద్యం వద్దు..
శీతాకాలంలో గొంతు గర గర, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు సాధారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తాయి. వీటికి యాంటీ బయాటిక్స్‌తో చికిత్స చేయ రు. యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు మాత్రమే పనిచేస్తాయి. వైరల్ సమస్యలకు వాడితే మితి మీరినప్పుడు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగి భవిష్యత్ లో సైడ్ ఎఫెక్ట్స్ కారణంతో ఇబ్బందులు తప్పవు. శీతల గాలుల ప్రభావం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా శీతాకాలం దుస్తులను ధరించాలి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శరీరాన్ని పూర్తి స్థాయిలో కప్పి ఉండే దుస్తులు ధరించాలి.
చిట్కాలు పాటించండి..
గొంతు గర గర, ఒంటి నొప్పులు తదితర సమస్యలను ఇంటి చిట్కాలు, జాగ్రత్తలతో నివారించవ చ్చు. వేడి నీరు, లెమన్ టీ, ఉప్పునీరు పుక్కిలించండి వంటి చిట్కాలు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తాయి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని పానీయాలు తీసుకోవడం ఎంతో మంచిది. లవంగం, మిరియాలు, శొంఠి పొడి చేసి తీసుకోవడం వల్ల ఆయా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వైరల్ గొంతు నొప్పికి యాంటీబయోటిక్స్ వాడకూడదు, డాక్టర్ సూచిస్తే మాత్రమే వాడాలి.
ఆందోళన వద్దు..
ప్రస్తుతం శీతల గాలుల ప్రభావంతో అధిక మంది గొంతు నొప్పి, శరీర నొప్పులతో బాధ పడుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన లేకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఆరుబయట ఆహారం కాకుండా ఇంటి వద్ద వేడి వేడిగా ఆహారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వేడి నీటిని వినియోగించడం ఉత్తమం.
– కె.లక్ష్మణరావు, ఎండీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టెక్కలి
ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి
ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జలుబు, దగ్గు, ఇతర సమస్యలు ఎదురైతే తక్షణమే గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి. సొంతంగా వైద్యం మానుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పగలంతా పనిచేసే వారికి ఒంటి నొప్పులు ఎదురైతే పెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయించకుండా వైద్యుల సలహాలను పాటించాలి.
– ఎస్.గాయత్రి, వైద్యురాలు, కె.కొత్తూరు పీహెచ్‌సీ, టెక్కలి మండలం
చలి.. రోగాల కౌగిలి
చలి.. రోగాల కౌగిలి
చలి.. రోగాల కౌగిలి


