ఆస్పత్రిలో ఏం జరుగుతోంది: డీసీహెచ్
నరసన్నపేట: ‘ఏరియా ఆస్పత్రిలో ఏం జరుగుతోంది. ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలీడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తప్పవు.’ అంటూ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అఽధికారి కళ్యాణ్ బాబు నరసన్నపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిని హెచ్చరించారు. సదరం సర్టిఫికెట్ల మంజూరు విషయంలో ఆస్పత్రి కాంట్రాక్టు సిబ్బంది చేతివాటంపై ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోగు లు, ఆస్పత్రి సిబ్బంది ఒకేలా కనిపించడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఎవరెవరు ఏ సిబ్బందో తెలియడం లేదని, శానిటేషన్ సిబ్బంది వారి డ్రెస్‌లు వేసుకోవాలని, కాంట్రాక్టు సిబ్బంది కూడా వారికి నచ్చిన డ్రెస్‌లు వేసుకొని వస్తామంటే కుదరదని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు. ఓపీ, సదరం, ఫార్మశిస్టు, నర్సులు, ఆఫీస్ రూం, వైద్యుల గదులు పరిశీలించారు. సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఆర్థో వైద్యు లు రమణారావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనుబాబుకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో జరుగుతున్న సివిల్ వర్క్స్‌ను పరిశీలించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రహరీ, లిఫ్ట్, 108 షెడ్, పాత కొత్త భవనాలకు కలుపుతూ నిర్మాణం చేస్తున్న వంతెన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
పాలశింగిలో పర్యటించిన వైద్యబృందం
టెక్కలి: టెక్కలి మండలం పాలశింగి గ్రామంలో శుక్రవారం వైద్య బృందాలు పర్యటించా యి. గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వివరాలను తెలుసుకునేందుకు ఈ బృందాలు పర్యటించాయి. డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చెందిన ప్రొగ్రాం అధికారి శివరంజని, పీహెచ్‌సీ వైద్యులు పవన్‌తేజ, భాగ్యశ్రీతో పాటు దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు బోకర నారాయణరావు తదితరులు గ్రామంలో పర్యటించి కిడ్నీ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రతపై ఇటీవల ‘సాక్షి’లో ‘పచ్చటి పల్లెలకు ముచ్చెమటలు’ అనే కథనం వెలువడిన సంగతి విదితమే.
మా ప్రాంతంలో ఇసుక పరిశ్రమ వద్దు
గార: తమ తీర ప్రాంతంలో ఇసుక పరిశ్రమ వద్దు అని శ్రీకూర్మం–మత్స్యలేశం పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. శుక్రవారం మేజర్ పంచాయతీ శ్రీకూ ర్మం పరిధిలోని శ్రీకూర్మ–మత్స్యలేశం సచివాలయం పక్కన తీర ప్రాంతంలోని ఆరు గ్రామా ల ప్రజలతో ఇసుక పరిశ్రమ ఏర్పాటు, శాంపిల్స్ సేకరణపై ప్రజాభిప్రాయాలను డిప్యూటీ తహసీల్దార్ ధనలక్ష్మీ అధ్యక్షతన తెలుసుకున్నారు. ఎస్.మత్స్యలేశంతో పాటు నీలాపుపేట, పడపానపేట, చుక్కపేట, నగిరెడ్లిపేట, పడపవానిపేట ఆరు గ్రామాలకు చెందిన ప్రజ లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీఎంఐడీసీ వైస్ ప్రెసిడెంట్ రామనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర కు ఈ ప్రాంతంలో ఇసుక మైనింగ్ చేసేందుకు అనుమతి ఉందన్నారు. దీని వల్ల ఎలాంటి నష్టం జరగదని, ఈ ప్రాంతమంతా రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనిపై స్థాని క ఆరు గ్రామాల నుంచి ఎంపిక చేసుకున్న వ్యక్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూగర్భ జలం కలుషితమవుతుందని, తద్వారా అనారోగ్యం పాలవుతామని, ఇప్పటికే తాగునీరు సమస్య ఉందన్నారు. మత్స్య సంపద దెబ్బతినడంతో పాటు తీర ప్రాంతంలోని బలమైన ఇసుక వ్యవస్థ దెబ్బతింటుందని మత్స్యకార ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, అటవీ రేంజ్ అధికారి కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో ఏం జరుగుతోంది: డీసీహెచ్
ఆస్పత్రిలో ఏం జరుగుతోంది: డీసీహెచ్


