● మత్తు వదలరా..
పూండి వాణిజ్య కేంద్రంలో కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతి ఆధ్వర్యంలో, ఎస్‌ఐ బి.నీహార్ అధ్యక్షతన డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో అభ్యుదయం సైకిల్ యాత్ర శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూండి సాయివినీత్ విద్యా సంస్థల ఆవరణలో సుమారు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు ఆరోగ్యకరమైన సమాజం ముద్దు వంటి స్లోగన్లతో ప్లకార్డులు ప్రదర్శించి మానవహారం చేపట్టారు. – వజ్రపుకొత్తూరు
పూండికి చేరుకున్న అభ్యుదయం సైకిల్‌యాత్రలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చేపట్టిన మానవ హారం
డ్రగ్స్‌కి నో చెప్పాలంటూ విద్యార్థుల ప్రదర్శన
● మత్తు వదలరా..


