
ఎకై ్సజ్ పోలీసులకు రాష్ట్ర అవార్డులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ విభాగానికి చెందిన ఏడుగురు పోలీసులకు 79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులు దక్కాయి. మంగళగిరి కార్యాలయంలో రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నితీష్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) రాహుల్‌దేవ్ శర్మ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావుకు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు.
ఆయనతో పాటు సోంపేట, పాతపట్నం ఇన్‌స్పెక్టర్లు జి.వి.రమణ, కె.కృష్ణారావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.రవిశేఖరరావు, ఎస్‌ఐ జె.సుజాత, కానిస్టేబుళ్లు పి.రమణ, బి.విఠలేశ్వరరావుకు అవార్డులు దక్కాయి.

ఎకై ్సజ్ పోలీసులకు రాష్ట్ర అవార్డులు