
చిన్నారులకు మాజీ సైనికుల చేయూత
శ్రీకాకుళం కల్చరల్ : ఇటీవల నరసన్నపేట మండలం దేవాది గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు మోహిని, యోగితలకు మాజీ సైనికులు, వీరనారీమణులు అండగా నిలిచారు. చిన్నారులు ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలో ఉన్నారని తెలుసుకుని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ వంతు సాయంగా రూ.1,02,232 సేకరించి ఇరువురి పేరిట సుకన్య ఖాతాలను తెరిచి పాస్ పుస్తకాలను శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ సమాజాహితాన్ని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడి రాజా మాజీ సైనికులు, వీరనారీమణులకు వాటర్ డిస్పెన్సెర్‌ను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత కెప్టెన్ పి.ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు, తర్ల కృష్ణారావు, ఎస్.రామకృష్ణ, ఎం.సింహాచలం, కె.కన్నారావు, పైడి విశ్వేశ్వరరావు, క్యాంటీన్ మేనేజర్ పప్పల గోవిందరావు, సభ్యులు బి.రాంబాబు, డి.వాసుదేవరావు, పి.శ్రీనివాసరావు, జి.రామారావు, డి.వరాహ నరసింహులు, ఎన్.లక్ష్మీనారాయణ, ఎం.రాములు, ఎ.వి.జగన్మోహన్‌రావు, కె.అప్పారావు, సీహెచ్.రామారావు, నాగభూషణరావు, అప్పలసూరి, శ్రీను, సురేష్, నారాయణ, వీరనారీమణులు కె.జగ్గమ్మ, జి.అమ్మన్నమ్మ, పి.పద్మావతి, ఎ.లక్ష్మీ, పి.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.