
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
పలాస: మోదుగులపుట్టి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం చెప్పారు. నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కంబకాయల దుర్యోధన టెక్కలిపట్నం బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా మోదుగులపుట్టి వద్ద వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బలమైన గాయాలు కావడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. దుర్యోధన కుమారుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.