5న ప్రభుత్వ ఉద్యోగుల మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మూడో రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు ఈ నెల 5న జరగనున్నాయని, ఈ సభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు తరలిరావాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 12వ పీఆర్‌సీ కమిషన్ వేయాలని, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని, పెండింగ్ పీఆర్‌సీ, డీఏ, ఎస్‌ఎల్‌ఎస్, ఏపీజీఎల్‌ఐ చెల్లింపులు కోసం, సీపీఎస్/జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని, 1వ తేదీన జీతాలు/ పెన్షన్లు చెల్లింపు చట్టబద్దం చేయాలని, ఎన్‌ఎంఆర్ కంటింజెంట్ / కాంట్రాక్టు / ఔట్ సోర్సింగు ఉద్యోగుల రెగ్యులరైజెషన్ తదితర 14 ప్రధాన డిమాండ్ల ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సభ్యులు తెలిపారు. అనంతరం మహాసభల పోస్టర్‌ను ఉద్యోగులు ఆవిష్కరించారు. సమావేశంలో ప్రెసిడెంట్ ఎస్.సోమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సంతోష్ కుమార్, స్టేట్ కార్యదర్శి జి.తిరుపతిరావు, సంఘ ప్రతినిధులు ఇప్పిలి నారాయణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పైల రవి, టౌన్ బోడి ప్రెసిడెంట్ పి.నాగేశ్వరరావు, టౌన్ సెక్రటరీ సూర్య చంద్ర, కె.రాజేశ్వరరావు, వి.శరథబాబు, అప్పలనాయుడు, రాష్ట్ర, జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.


