రూపురేఖలు మార్చి.. రాష్ట్రస్థాయికి చేర్చి..
పనులు పూర్తి చేశాక ఆనందపురం యూపీ పాఠశాల ఇలా
ఒకప్పుడు జి.సిగడాం మండలం ఆనందపురం ప్రాథమికోన్నత పాఠశాల అంటే అందరికీ గుర్తొచ్చేది.. చుట్టూ మురుగునీరు నిండిన ఓ సర్కారు బడి మాత్రమే. ఎంతమంది పాలకులు వచ్చినా పాఠశాల దుస్థితిని, వర్షం పడిన తర్వాత బడిని చుట్టుముట్టే మురుగును తప్పించలేకపోయారు. ఈ సమస్యకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే పరిష్కారం చూపారు. నాడు–నేడు పథకం కింద బడి రూపురేఖలు సమూలంగా మార్చేశారు. అంతేకాకుండా 2022లో రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు 68 పాఠశాలలను ఎంపిక చేయగా ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ విభాగంలో ఇదే పాఠశాల అవార్డు సైతం దక్కించుకుంది. ఈ ఒక్క పాఠశాలే కాదు జిల్లాలోని వందలాది ప్రభుత్వం పాఠశాలల తలరాతలను మార్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సర్కారుదే.
– జి.సిగడాం
రూపురేఖలు మార్చి.. రాష్ట్రస్థాయికి చేర్చి..
రూపురేఖలు మార్చి.. రాష్ట్రస్థాయికి చేర్చి..


