సర్టిఫికెట్ల పరిశీలన నేడు | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల పరిశీలన నేడు

May 27 2025 12:39 AM | Updated on May 27 2025 12:39 AM

సర్టి

సర్టిఫికెట్ల పరిశీలన నేడు

శ్రీకాకుళం న్యూకాలనీ: ఖాళీగా ఉన్నటువంటి హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన టీచర్ల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించనున్నారు. జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నత పాఠశాలల్లో ఖాళీ(పదవీ విరమణ, మరణం, రీ అపోర్షన్‌ కారణంగా)గా ఉన్న హెచ్‌ఎం పోస్టులను అర్హత కలిగిన స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో భర్తీ చేయనున్నట్లు డీఈవో డాక్టర్‌ ఎస్‌.తిరుమల చైతన్య పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 83 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సీనియారిటీ జాబితాను శ్రీకాకుళం డీఈఓ.ఓఆర్జీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు చెప్పారు. సీనియారిటీ జాబితాలో పేర్కొన్న అర్హత కలిగిన స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులు మాత్రమే 27వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం ప్రభుత్వ(బాలుర) ఉన్నత పాఠశాల వేదికగా జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. వారి అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు సర్వీస్‌ రిజిస్టర్‌ తమవెంట తీసుకురావాలని స్పష్టం చేశారు.

జిల్లాలో చిన్నారులకు వ్యాక్సినేషన్‌

జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి అనిత వెల్లడి

అరసవల్లి: జిల్లాలో చిన్నారులకు ఆటలమ్మ, రూబెల్లా వ్యాధులు సంక్రమించకుండా అన్ని ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల వద్ద మీజిల్స్‌ రూబిల్లా వ్యాక్సినేషన్‌ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అనిత తెలియజేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేసి మూడు విడతలుగా వ్యాక్సినేషన్‌ చేసేలా చర్యలు చేపట్టనునట్లు వివరించారు. మొదటి విడతగా ఈనెల 26 నుంచి 31 వరకు, రెండో విడతగా వచ్చే జూన్‌ 23 నుంచి 28 వరకు, అలాగే మూడో విడతగా జూలై 21 నుంచి 26 వరకు ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లుగా వివరించారు. ఈ ప్రక్రియను జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ రామదాస్‌ పర్యవేక్షణలో చేపతామని వివరించారు.

నిద్రమత్తులో లారీ బోల్తా

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 10వ వార్డు పారసాంబ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ బోల్తాపడింది. ఇచ్ఛాపురం నుంచి టెక్కలి వైపు వెళ్తుండగా పలాస దాటిన అనంతరం డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండడంతో రోడ్డుపక్కకు వెళ్లిపోయింది. అప్రమత్తమైన లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా అదుపుచేసినప్పటికీ తవుడు లోడుతో ఉన్నటువంటి లారీ పల్టీలుకొట్టింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ గాయాలతో బయటపడ్డారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోశాధికారిగా శ్రీనివాసరావు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఏపీ ఎన్జీవోస్‌ విజయవాడ కార్యాలయంలో నిర్వహించిన ఏపీటీఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికల్లో జిల్లాకు చెందిన బొత్స శ్రీనివాసరావుని ఆ సంఘం కోశాధికారిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు విజయవాడలో ఆదివారం జరిగాయి. రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై శ్రీకాకుళం జిల్లా ఏపీటీఎస్‌ఏ అధ్యక్షుడు దొడ్ల శ్రీరామ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి డేవిడ్‌ మాదారపు ఇతర కార్యవర్గం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో

బెట్టింగ్‌ రాయుళ్లు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో బెట్టింగ్‌ మాఫియా మూలాలు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే అటు సీసీఎస్‌ స్టేషన్‌లోను, ఇటు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోను, రూరల్‌, ఎచ్చెర్ల, వన్‌టౌన్‌ పీఎస్‌ల్లో సుమారు 13 మందిని విచారించినట్లు తెలుస్తోంది. వీరిలో ప్రధాన బుకీ డి.శ్రీనివాస్‌ కూడా ఉండటం విశేషం. దొరికిన వారికి విశాఖలోని పెద్ద బుకీలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సర్టిఫికెట్ల పరిశీలన నేడు 1
1/1

సర్టిఫికెట్ల పరిశీలన నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement