ఉచిత శిక్షణతో ఉపాధి
నరసన్నపేట: సేవే పరమావధిగా సత్యసాయి సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా స్వల్పకాలిక ఉచిత నైపుణ్య శిక్షణలు అందిస్తున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులకు, గృహిణులకు వారి ఆసక్తి బట్టి శిక్షణలు ఇస్తూ ఉపాధి అవకాశాలపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, కంప్యూటర్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణలు ఇస్తున్నారు. నరసన్నపేట మండలంతో పాటు పరిసర మండలాలకు చెందిన వారూ వచ్చి ఉచిత శిక్షణలకు వినియోగించుకుంటున్నారు. నరసన్నపేటలోని మారుతీనగర్ –1 లో సత్యసాయి మందిరం, చిత్తిరి వీధిలోని సాయి పెద్ద మందిరంలో ఏడాది కాలంగా ఈ స్వల్ప కాలిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. మారుతీనగర్‌లో 510 మంది, పెద్దమందిరంలో 260 మంది శిక్షణ పొందారు. కంప్యూటర్ శిక్షణకు మంచి ఆదరణ లబిస్తుంద పెద్ద మందిరం కన్వినర్ నాగేశ్వరరావు చెబుతున్నారు. ఇప్పటికే రూ. 3.5 లక్షలు వెచ్చించి కంప్యూటర్లు, స్క్రీన్ సిద్ధం చేశామన్నారు.
సత్యసాయి మందిరాల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ
నరసన్నపేటలో ఇప్పటివరకు 770 మందికి తర్ఫీదు
ఆసక్తి చూపుతున్న మహిళలు
ఉచిత శిక్షణతో ఉపాధి


