వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
● లావేరు మండలం వేణుగోపాలపురంలో ఘటన
రణస్థలం: లావేరు మండలంలోని గుమడాం పంచాయతీలో గల వేణుగోపాలపురం (ఆగ్రహారం) లో వైఎస్సార్ పీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. బాధితుడు మీసాల రామప్పడు పోలీ సులకు తెలిపిన వివరాలు ప్రకారం.. రామప్పడు శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన ఇజ్జురోతు సూర్యారావు, ఆశ వర్కర్ భూలక్ష్మి ఆయనను పిలి చారు. దుర్భాషలాడుతూ మీద మీదకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇజ్జురోతు బ్రహ్మాజీ రాయితో ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు చూసి రక్తపు మడుగులో ఉన్న రామప్పడును రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు లావేరు ఏఎస్‌ఐ ఎస్.ప్రసాదరావు వచ్చి వాంగ్మూలం సేకరించారు. ఈ ఘటనలో నిందితు డు ఇజ్జురోతు బ్రహ్మాజీ కూడా పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి తెలిపారు.
గొడవకు దారి తీసిన కారణాలివే..
ఇజ్జురోతు బ్రహ్మాజీకి సంబంధించి ఒక భూమి వివాదంలో ఉంది. ఆ వివాదం వైఎస్సార్ సీపీ సర్పంచ్ ప్రతినిధి దుర్గాశి ధర్మారావు క్లియర్ చేశారు. దీంతో బ్రహ్మాజీ సర్పంచ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని మీసాల రామప్పడు సర్పంచ్ ధర్మారావుకు చేరవేశారు. మూడు రోజుల కిందట ఎందుకిలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావని గ్రామపెద్దలు, సర్పంచ్ ధర్మారావు బ్రహ్మాజీని మందలించారు. తాను తిడుతున్న విషయం సర్పంచ్‌కు రామప్పడు చేరవేశాడనే అక్కసుతో అతనిపై దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి


