మాట వంకరం తీరు సంకరం | - | Sakshi
Sakshi News home page

మాట వంకరం తీరు సంకరం

Jan 3 2026 8:03 AM | Updated on Jan 3 2026 8:03 AM

మాట వ

మాట వంకరం తీరు సంకరం

● కార్పొరేషన్‌లో బూతు పంచాంగంపై

అంతర్మఽథనం

● ఉద్యోగులకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నియోజకవర్గ కీలకనేత

● ప్రతి ఫైల్‌ తన అనుమతితోనే కదలాలని ఆదేశం

● మాట వినని అధికారులపై పరుష పదజాలంతో దూషణ

● కీలక నేత తీరుపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

‘ఆయనకెవరైనా చెప్పండి’.. అంటూ కార్పొరేషన్‌ ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. అధికార అహంభావంతో నోటికొచ్చిన మాట విసిరేస్తున్న కీలక నేత వైఖరిపై వారు విసుగెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేత ‘సొంత నిర్ణయాలు వద్దు.. చెప్పిన చోట సంతకాలు చేయాలి.. లేదంటే విధులు నుంచి తప్పుకోవాలి’ అంటూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. నోటికేది వస్తే అదే మాటలాడుతున్నారు. ఆయనకు నచ్చకుండా ఏదైనా చేసినట్లు తెలిసినా, ఆయన దృష్టిలో లేకుండా ఏ పనైనా చేసినా, తన అనుచరులు చెప్పినా నోటికొచ్చినట్లు చెప్పలేని భాషలో బూతుపురాణం మొదలెట్టి చివరికి ఉద్యోగం చేయాలంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండని సీరియస్‌గా హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారులు ఎప్పుడు అవకాశం వస్తే వేరే చోటకు వెళ్లిపోదామా అని చూస్తున్నారు.

● కొన్ని నెలల కిందట శ్రీకాకుళం నగరం పీఎన్‌కాలనీకి చెందిన ఓ సీనియర్‌ మున్సిపల్‌ ఇంజినీర్‌ (ఎమ్‌ఈ) కీలక నేత ఒత్తిడికి కొన్నాళ్లు సెలవు పెట్టి ఆ తర్వాత విశాఖపట్నంకు బదిలీపై వెళ్లిపోయారు.

● గత ఏడాది జూన్‌లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం సమయంలో పలుచోట్ల టాయిలెట్స్‌తో పాటు సౌకర్యాలు కల్పించడం చేతకాలేదని మున్సిపల్‌ అధికారులను ఉద్దేశించి ‘మీరు తాగుబోతులు.. తాగి పడుకోండి.. నీలాంటోడికి ఉద్యోగం ఎందుకు’ అంటూ చెప్పలేని భాషలో తిట్టడంతో ఎవరికీ చెప్పుకోలేక ఉండలేక మిన్నకుండిపోయారు.

● ఇంజినీరింగ్‌ విభాగంలో సచివాలయం ఇంజినీర్లతో పాటు ఏఈలు, డీఈలు, ఎమ్‌ఈ, కాంట్రాక్టర్లకు సైతం నోటికొచ్చినట్లు తిడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఆ నాయకుడు కార్పొరేషన్‌ కార్యాలయానికి రెండురోజులకోసారి వచ్చి రాత్రి 11 గంటల వరకు ఉద్యోగుల్ని టార్చర్‌ చేస్తున్నారని గొల్లుమంటున్నారు.

అంతా తానై..

కార్పోరేషన్‌లో ఎవరికి ఏ వర్క్‌ ఇవ్వాలి, ఆ కాంట్రాక్టర్‌ ఎవరై ఉండాలి ఇలా అంతా ఆయనే నిర్దేశిస్తున్నారు. కార్పోరేషన్‌లో చీమ కదలడానికై నా తన అనుమతి ఉండాలన్న హుకుం జారీచేస్తున్నా రు. నియోజకవర్గ కీలక నేతకు కోటరీగా ఉన్న నాయకులకే అన్నీ జరిగేలా చూసుకుంటున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో వర్కుల కాంట్రాక్టుల కేటాయింపులో వివక్ష చూపిస్తూ తన వాళ్ల జేబులు నింపే పనిలో పడ్డారు. అందులోంచి తనకు రావాల్సిన వాటా కోసం ఆరాటపడుతున్నారు. గత కొంత కాలంగా కార్పొరేషన్‌లో మంజూరైన పనులు, వాటి కాంట్రాక్టు దక్కించుకున్నవారి జాబితా చూస్తే కీలక నేత పచ్చపాతం ఏంటో తెలుస్తోంది. పనులు కేటాయింపులే కాకుండా ఆ పనుల బిల్లులు చెల్లింపు విషయంలో కూడా తన మార్క్‌ కనబడాలని చెప్పినట్టు జరగాలని అజమాయిషీ చేస్తున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్‌లో జరిగిన చెల్లింపులను పరిశీలిస్తే జరుగుతున్న తంతు కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. తన అభిరుచుల మేరకు తన ఆలోచనల మేరకు తన అభిప్రాయం ప్రకారం తన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే అధికారులే ఉండాలని దర్పం ప్రదర్శిస్తున్నారు.

ఎవరైనా మాట వినకపోయినా, చెప్పినట్టు జరగకపోయినా సంబంధిత అధికారులపై ఒంటి కాలిపై లేచి నోటికి పనిచెబుతున్నారు. ఆ సమీక్షల పేరిట నిర్వహించిన సమావేశాల్లో సహనం కోల్పోయి విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. బెదిరించే ధోరణితో మాట్లాడి ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆ దూషణలు, బూతుపురాణం వినలేక చెప్పినట్టే చేసుకుపోతున్నారు. ఆత్మగౌరవంతో పనిచేయాలనుకున్నవారు ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. మానసిక క్షోభలో కూడా కొందరు ఉద్యోగులు తప్పని పరిస్థితిలో పనిచేస్తున్నారు.

మాట వంకరం తీరు సంకరం1
1/1

మాట వంకరం తీరు సంకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement