మృదంగ తరంగం
● రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన కుర్రాడు
కంచిలి: డ్రమ్స్ అంటూ జాక్‌బాక్స్ అంటూ పాశ్చాత్య శైలికి బాగా ఆకర్షితులమవుతున్న రోజు ల్లో ఓ పదో తరగతి విద్యార్థి మృదంగం ధ్వనిని ఇష్టపడుతున్నాడు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని బతికించేందుకు మృదంగం వాయించడం నేర్చుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి కళకు కాపలా ఉంటానని ప్రకటించాడు. కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన బొయిరిశెట్టి గౌతమ్ మృదంగ విద్యలో నిష్ణాతుడవుతున్నాడు. కొద్దినెలల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీ ల్లో సత్తా చాటాడు. ఆమదాలవలసకు చెందిన మావుడూరు సూర్యప్రసాద్ శర్మ ఆశీస్సులతో శ్రీ మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ప్రచార కార్య దర్శి, ప్రముఖ మృదంగ వి ద్వాంసుడు చలపరాయి వినో ద్ కుమార్ శిష్యరికంలో గౌతమ్ రాటుదేలుతున్నాడు.
కుటుంబ నేపథ్యం..
గౌతమ్ తాత ఒడిశా పరిధి గుడ్డిపద్ద గ్రామానికి చెందిన ధవలశెట్టి కూర్మారావు గాత్ర కళాకారుడు. తండ్రి మోహనరావు హార్మోనియం వాయిస్తారు. తల్లి జీవేశ్వరి గృహిణి. ప్రస్తుతం తండ్రి మోహనరావు బయటి దేశానికి ఉపాధి కోసం వెళ్లారు. సంగీతంపై ఆసక్తి ఉండడంతో గౌతమ్‌ను చిన్నప్పుడే చలపరాయి వినోద్‌కుమార్ వద్ద చేర్పించారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి పోటీల వరకు ఎదిగాడు. ఇటీవల స్వగ్రామం జాడుపూడిలోను, ఆర్.బెలగాం పాఠశాలలో గౌతమ్‌ను సత్కరించారు.
మృదంగ తరంగం


