చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నారు?
● ఎంపీడీఓపై జెడ్పీ సీఈఓ ఆగ్రహం
శ్రీకాకుళం రూరల్: ిసంగుపురం రహదారిపై నిత్యం దుర్వాసన వస్తోందని, ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే చెత్తచెదారాలు కుప్పలుగా పేరుకుపోయినా పంచాయతీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నా రని జెడ్సీ సీఈఓ సత్యనారాయణ శ్రీకాకుళం ఎంపీడీఓ ప్రకాశరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సీఈఓ వాహనం ఆపి పరిశీలించారు. జాతీయ రహదారిపై నిత్యం ఇదే దారిలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారని, ఇలా ఎక్కడికక్కడే చెత్తచెదారాలు పారబోస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన రహదారి పరిస్థితే ఇలా ఉంటే గ్రామ వీధుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని అసహనం వ్యక్తం చేశారు.


