రైలెక్కి హల్‌చల్‌ చేసిన యువకుడు | - | Sakshi
Sakshi News home page

రైలెక్కి హల్‌చల్‌ చేసిన యువకుడు

Jan 5 2026 7:41 AM | Updated on Jan 5 2026 7:41 AM

రైలెక

రైలెక్కి హల్‌చల్‌ చేసిన యువకుడు

రైల్వేస్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు

రైలు పెట్టైపె కూర్చున్న యువకుడు

కంచిలి: కంచిలి మండల కేంద్రంలో గల సోంపేట రైల్వేస్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్‌ రైలెక్కి ఓ యువకుడు ఆదివారం హల్‌చల్‌ చేశాడు. భువనేశ్వర్‌ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్‌ నంబర్‌ 22871 మధ్యాహ్నం 3.26 గంటలకు వచ్చింది. ఇంతలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హౌరా పట్టణం నవదీప్‌ ప్రాంతానికి చెందిన ప్రయాణికుడు విజయ్‌ సర్కార్‌ అమాంతంగా రైలు పైకి ఎక్కాడు. ఎక్కడమే కాకుండా అందర్నీ భయ భ్రాంతులకు గురిచేశాడు. రైలు పైన అటు, ఇటూ పరిగెడుతూ హల్‌చల్‌ చేశాడు. దీంతో స్టేషన్‌ మాస్టర్‌ బలరాం బెహరా వెంటనే అక్కడికి చేరుకొని ఖుర్దా డీఆర్‌ఎం ఆఫీస్‌కు ఫోన్‌ చేసి, విద్యుత్‌ సరఫరాను ఆపించారు. తర్వాత చాకచక్యంగా స్థానిక సిబ్బంది, ప్రయాణికులు కలిసి ఆ యువకుడిని కిందకు దించి, అదుపులోకి తీసుకొన్నారు. ఈ సమాచారం అందుకున్న కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు అక్కడకు చేరుకొని, ఆ యువకుడిని స్టేషన్‌ వెయిటింగ్‌ రూమ్‌లో ఉంచి, పలాస రైల్వే పోలీసులకు అప్పగించారు.

ఆ యువకుడు ఏదో మత్తు పదార్థాలు సేవించి, మతిస్థిమితం కోల్పోయి ఇలా తిక్కతిక్కగా వ్యవహరించినట్లు గుర్తించారు. అతడి జేబులో విశాఖ పట్నం నుంచి హౌరాకు పెనాల్టీ కట్టినట్లు ఒక స్లిప్‌ జేబులో ఉందని అధికారులు గుర్తించారు. ఈ యువకుడు చేసిన పనికి సూపర్‌ఫాస్ట్‌ రైలు 21 నిమిషాలు పాటు సోంపేట స్టేషన్‌లో నిలిచిపోయింది.

రైలెక్కి హల్‌చల్‌ చేసిన యువకుడు 1
1/1

రైలెక్కి హల్‌చల్‌ చేసిన యువకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement