వైశాఖం వచ్చినా.. మీనమేషాలేనా.? | - | Sakshi
Sakshi News home page

వైశాఖం వచ్చినా.. మీనమేషాలేనా.?

May 1 2025 1:22 AM | Updated on May 1 2025 1:22 AM

వైశాఖం వచ్చినా.. మీనమేషాలేనా.?

వైశాఖం వచ్చినా.. మీనమేషాలేనా.?

అరసవల్లి: వైశాఖ మాసం వచ్చేసింది. ఈ మాసంలో అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో ప్రత్యేక సందడి నెలకొంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. కానీ అందుకు తగ్గట్టు భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన రథసప్తమి మహోత్సవాలు సందర్భంగా ఆల యం ముందు భాగంలో ఉన్న నిర్మాణాలు, షెడ్లు అన్నింటినీ తొలగించేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఎండ తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో భక్తులకు ఎండ దెబ్బలు తప్పవని అర్థమవుతోంది. ఆలయంలో గత వైశాఖ మాసానికి వేలల్లో భక్తులు తరలి వచ్చినప్పటికీ అందుకు తగిన షె డ్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా వసతి ఏర్పాట్లు ఉండడంతో ఇబ్బందులు కలుగలేదు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది.

ఆలయం ముందు నిర్మాణాలు, షెడ్లు తొలగించేయడంతో పాటు అన్నదాన ప్రసాదం, ల డ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు కూడా తాత్కాలికంగా మారాయి. దీంతో భక్తులు గత మూడు నెలలుగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎండ అవస్థలతో పాటు మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఆలయం ముందు మంచినీటి పంపిణీకి, భక్తులు సేద తీరడానికి చిన్నపాటి పందిళ్లతో సరిపెట్టిన ఆలయ అధికారుల తీరు రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది.

మూడు నెలల కిందట కూల్చేసిన షెడ్ల భాగాలతోనే ఇంద్రపుష్కరిణి ఒడ్డున అన్నదానం కోసం ఓ షెడ్డును వేసి మిన్నకుండిపోయారు. మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా తాత్కాలికంగానే ఏ ర్పాటు చేయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింకు రేకులతో మరుగుదొడ్లు వేయడంతో ఈ వేసవిలో వైశాఖ మాసంలో అవస్థలు తప్పే లా లేవు. దుకాణాలు కూల్చేసేటప్పుడు చెప్పిన హామీలను అధికార పార్టీ నేతలు పట్టించుకోవ డం లేదంటూ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నా రు. ఇప్పటికై నా న్యాయం చేయాలంటూ ఆలయ షాపింగ్‌ కాంప్లెక్స్‌ బాధితులు కోరుతున్నారు.

అరసవల్లిలో కానరాని ఏర్పాట్లు

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement