
రమణమూర్తికి ఈఓగా పదోన్నతి
అరసవల్లి: అరసవల్లి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుప్పన్నగారి రమణమూర్తికి గ్రేడ్–3 ఈవోగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి గతేడాది అరసవల్లి ఆలయానికి బదిలీపై రాగా.. తాజా పదోన్నతితో మళ్లీ విజయనగరంలో 6–సి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం అరసవల్లి ఆలయంలో అన్నదాన ప్రసాదాల సెక్షన్ ఇన్‌చార్జిగా ఉన్న ఈయనకు పదోన్నతి రావడంపై ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
‘ఆదిత్య’లో జాతీయ స్థాయి పోటీలు
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్‌లైన్ ద్వారా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో క్విజ్, డిజిటల్ పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, స్లోగన్ రైటింగ్, అవేర్‌నెస్ రీల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
హోంగార్డు కుటుంబానికి సాయం
శ్రీకాకుళం క్రైమ్ : హోంగార్డు పి.పైడిరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి రూ.4.07 లక్షల నగదు చెక్కును మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అందజేశారు. సహచర హోంగార్డుల ఒక్కరోజు వేతనాన్ని ఈవిధంగా అందించారు.
నీలమణి దుర్గ ఉత్సవాలు ప్రారంభం
పాతపట్నం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి 50వ వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమపూజ, అష్టోత్తర శతనామ పూజ, హోమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సుదీష్ఠ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మే 7 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఈవో టి.వాసుదేవరావు చెప్పారు. పూజా కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సన్యాసిరావు, బాబ్జీ, సతీష్, మడ్డు రామారావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఒడిశా గవర్నర్‌కు స్వాగతం
కంచిలి: మండలంలోని దాలేశ్వరం గ్రామంలోని సోలార్ ప్లాంట్ వద్దకు మంగళవారం విచ్చేసిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుకు మండల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను కలిసి రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఈఓపీఆర్‌డీ పి.ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రమణమూర్తికి ఈఓగా పదోన్నతి

రమణమూర్తికి ఈఓగా పదోన్నతి

రమణమూర్తికి ఈఓగా పదోన్నతి