
గురుకులాల సమస్యలపై వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, భవనాలకు మరమ్మతులు చేయించాలని, పారా మెడికల్ కోర్సులు ప్రవేశ పెట్టాలని, డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచాలని దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. 2024 డిసెంబర్‌లో అంబేడ్కర్ వర్థంతి నుంచి 2025 ఏప్రిల్‌లో అంబేడ్కర్ జయంతి వరకు చేపట్టిన గురుకులాల సర్వే వివరాలను సైతం కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పేడాడ కృష్ణారావు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామారావు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్‌గోపాల్, ఎస్సీ ఎస్టీ విజిలెనన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అర్జి కోటి, మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి నగర కార్యదర్శి కానుకుర్తి గోవింద్, మాలమహానాడు నాయకులు ముచ్చ శ్యామ్, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వన్నెలు లక్ష్మీనారాయణ, బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు చీర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గురుకులాల సమస్యలపై వినతి