
మూడు తులాల బంగారం చోరీ
ఎల్.ఎన్.పేట: మండలంలోని చింతలబడవంజ కాలనీలో రొంపివలస రమణ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సోమవారం వర్షం పడిన తరువాత విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో బయట వరండాలో నిద్రపోయామని, మంగళవారం ఉదయం నిద్రలేచిన తరువాత ఇంట్లోకి వెళ్లేసరికి బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని బాధితుడు రమణ తెలిపారు. బీరువాలో మూడు తులాల బంగారు నగలు, పది తులాల వెండి, రూ.9వేలు నగదు దొంగలు ఎత్తుకెల్లిపోయారని బాధితుడు మంగళవారం సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్సై బాలరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.