
అసిస్టెంట్ కలెక్టర్‌గా పృథ్వీ రాజ్‌కుమార్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణలో ఉన్న దొనక పృథ్వీ రాజ్‌కుమార్‌ను నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకు ఈ పదవిలో ఉంటారు. పృథ్వీకుమార్ వయసు 23 ఏళ్లు. ఈయన 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన పృథ్వీ తండ్రి విజయకుమార్ మండల విద్యాధికా రి (ఎంఈఓ)గా, తల్లి వెంకటరత్నం గృహిణిగా ఉన్నారు. సోదరి పూజిత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. పృథ్వీ ప్రాథమిక విద్య నుంచి పదో తరగతి వరకు పార్వతీపురంలోనే చదివారు. ఇంటర్ నారాయణ లో చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియాలజీ సబ్జెక్టులతో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీ, ఢిల్లీ ద్వారా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ సాధించారు. తర్వాత సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం సేకరించేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించడమే తన లక్ష్యమని పృథ్వీ రాజ్ కుమార్ తెలిపారు.