
చందనోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈనెల 30వ తేదీన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన ట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శ్రీకాకుళం కాంప్లె క్స్ నుంచి రణస్థలం, నాతవలస, విజయనగరం, పద్మనాభం, శొంఠ్యాం మీదుగా అడవివరం–రణస్థలం, తగరపువలస, ఆనందపురం, శొంఠ్యాం మీదుగా అడవివరం వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. అడివివరం గోశాల నుంచి కొండపైకి 13 సిటీ బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్ శర్మ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్లు వి.రమేష్, ఎ.గంగరాజు, ఎస్‌ఎం ఎంపీ రావు, ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. – శ్రీకాకుళం అర్బన్