
నా చేతిని చూస్తే భయపడతారు..
నా చేతిని చూసే ఎవరైనా భయపడతారు. డయాలసిస్ సేవలు అందుతున్నప్పటి నుంచి నా ఎడమ చేతిలో వాపులు భయంకరంగా మారాయి. నాకు కిడ్నీ సమస్య వచ్చిన అనంతరం ప్రాణాలు నిలుపుకోవడానికి రూ.1.50 లక్షల విలువైన గొర్రెపిల్లలను అమ్మి నేను చికిత్స చేయించుకున్నాను. ప్రైవేటులో ఫిస్టులా ఆపరేషన్ చేసుకుని ఇప్పుడు పలాస నెఫ్రోప్లస్‌లో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నాను. ఇప్పుడు నా చేయి రూపురేఖలు మారిపోయాయి. మా లాంటి వారి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. – సవర లక్ష్మమ్మ, సవరలింగుపురం, మెళియాపుట్టి మండలం

నా చేతిని చూస్తే భయపడతారు..