
గొట్టా.. ముప్పు ఆగేదెట్టా..?
● వరదల ధాటికి పాడైన గొట్టా బ్యారేజీ రాతి కట్టడాలు
● పనులు పూర్తి చేయకుంటే బ్యారేజీకే ముప్పు
● ఆందోళన చెందుతున్న రైతులు
● సీఈకి ప్రతిపాదనలు
పంపించాం
హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద ఏప్రాన్ పూర్తిగా పాడై ఉంది, పను లు చేసేయాలని ఇటీవల జిల్లాకు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి చె ప్పారు. టెండర్లు పిలిచేందుకు కావాల్సిన దస్త్రాలను సీఈకి ప్రతిపాదనలు పంపించాం. త దుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. ఈ సీజన్‌లో దాని వల్ల ఎలాంటి ముప్పు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. వచ్చే సీజన్‌కు తప్పనిసరిగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తాం.
– పీవీ తిరుపతిరావు,
బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు, ఎస్‌ఈ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కాలం గడుస్తున్న కొద్దీ గొట్టా బ్యారేజీ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతోంది. జిల్లాకు జీవనాడి వంటి బ్యారేజీ పరిరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. వంశధార స్టేజ్–1, ఫేజ్–2 పనులకు జలయజ్ఞంలో భాగంగా రూ.933కోట్లతో పనులు ప్రారంభించారు. అప్పట్లో వంశధార గట్లు పటిష్టం చేయడం, హిరమండలం రిజర్వాయర్ నిర్మాణం, ప్యాకేజీ–87, 88లకు శ్రీకారం చుట్టారు. వంశధార నదిలో నీటిని ఒడిసిపట్టి జిల్లాలో 2.55లక్షల హె క్టార్లలో రెండు పంటలకు నీరందించాలంటే అది ఒక్క వంశధార నదిలో నీరు వృధా కాకుండా అడ్డుకట్ట వేయడంతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి ధర్మాన ఇంజినీర్లతో కలిసి డిజైన్ చేశారు. నదిలో వచ్చే నీటిని నిల్వచేసేందుకు గొట్టాబ్యారేజీ వద్ద గేట్లు ఏర్పాటు చేసి కొంతమేర రైతుల అవసరాలను బట్టి నీటిని వదిలేవారు. నీరు నిత్యం పారుతుండడంతో గొట్టా బ్యారేజీకి దిగువ భాగాన ఉన్న రాతి కట్టడాలు వరదలకు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ తర్వాత వచ్చిన వర్షా లు, వరదలకు ఏటా కొంచెం, కొంచెంగా ఇసుక మేటలు వేసి రాళ్లు కొట్టుకుపోయి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాతి కట్టడాలు సరిగా లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. వాస్తవానికి వంశధార ఎడమ కాలువ పనులు చేసేందుకు టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పు డు రూ.380 కోట్లు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు దాని పని అంచనా దాదాపు మూడింతలైంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో
రూ 12.91కోట్లు మంజూరు
వైఎస్ జగన్ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో హిరమండలం గొట్టా బ్యారే జీ వద్ద ఏప్రాన్ (రాతికట్టడాల) పనులు చేసేందుకు గాను రూ.12.91కోట్లు నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే హిరమండ లం రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ 176.35 కోట్లు, ఉద్దానం ప్రాంతానికి తాగునీరు సౌకర్యం కల్పించడానికి రూ.700కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూ 852.45కోట్లు, వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేందుకు రూ.216.71కోట్లు, పాతపట్నం నియోజక వర్గంలో రెండు మండలాలకు మంచినీటి ప్రాజెక్టు కింద రూ.250కోట్లు మంజూరు చేశారు. ఏప్రాన్ పనులు ప్రారంభించేలోపే ఎన్నికల కోడ్ రావడంతో అర్ధంతరంగా టెండర్ల దశలోనే ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడం దారుణమని రైతులు, నదీపరివాహక ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జలవనరుల శాఖమంత్రి రామానాయుడు జిల్లాకు వచ్చినా ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులేవీ చూడకుండా అచ్చెన్న ఇలాకాలో పనులు మాత్రమే చూసి తూతూమంత్రంగా వెళ్లిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో పనులు చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ఆదేశాలిస్తారో లేదో వేచి చూడాలి.

గొట్టా.. ముప్పు ఆగేదెట్టా..?

గొట్టా.. ముప్పు ఆగేదెట్టా..?