
తమ్మినేనికి చింతాడ అభినందనలు
ఆమదాలవలస: మాజీ స్పీకర్, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినే ని సీతారాంను ఇటీవల వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్‌గా పార్టీ అధిష్టానం నియమించిన సందర్భంగా ఆమదాలవలస పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గురువారం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి జగన్‌మోహన్ రెడ్డిని సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, పార్టీ మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిల ర్లు సాధు కామేశ్వరరావు, నాయకులు ఎస్.రామారావు, పొన్నాడ చిన్నారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.