
తిలారు పాఠశాలలో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం తిలారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోరీ జరిగినట్లు ప్రధానోపాధ్యాయుడు టి.లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17వ తేదీ రాత్రి పాఠశాలలో దుండగులు చొరబడి 6వ తరగతి గది తాళాలు బద్దలుకొట్టి డెస్క్‌టాప్, కీబోర్డు, ప్రొజెక్టర్ వంటి సుమారు రూ.2లక్షలు విలువైన సామగ్రీ పట్టుకుపోయారని పేర్కొన్నారు. శుక్రవారం పాఠశాల సెలవు రోజుకావడంతో శనివారం వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించామని తెలిపారు. కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
మందస: మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా చుక్కాంబో, సవర రాజపురం బుడంబో గ్రామాల్లో శనివారం తనిఖీ చేయగా సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల సారా ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.బేబి తెలిపారు.

తిలారు పాఠశాలలో చోరీ