నిమ్మాడలో పట్టపగలే చోరీ | - | Sakshi
Sakshi News home page

నిమ్మాడలో పట్టపగలే చోరీ

Mar 21 2025 12:52 AM | Updated on Mar 21 2025 12:50 AM

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ ప్రధాన రహదారిలో మంత్రి సోదరుడి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న శిమ్మ కృష్ణారావు ఇంట్లో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. కోట బొమ్మాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణారావు తన భార్య లక్ష్మీతో కలిసి పొలం పనికి వెళ్తూ ఇంటి తాళం చెవిని ఆవరణలో పెట్టి వెళ్లిపోయారు. కుమారుడు, కోడలు పనుల నిమిత్తం నరసన్నపేట వెళ్లారు. తాళం చెవి ఇంటి ఆవరణలో పెట్టడం గమనించిన దుండగులు దర్జాగా తాళం తీసి ఇంట్లో ప్రవేశించి 6 తులాల బంగారం, కొంత నగదు అపహరించుకుపోయారు. కృష్ణారావు పొలం పనులు ముగించి ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం, నగదు పోయినట్లు గుర్తించారు. అనంతరం కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సీఎస్‌ఎస్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం కల్చరల్‌: క్రైస్తవ సమాజానికి సేవలు అందించడమే లక్ష్యంగా క్రిస్టియన్‌ సెక్యూర్‌ సర్వీసెస్‌(సీఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెర్సి చర్చిలో సీఎస్‌ఎస్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బిషప్‌ డాక్టర్‌ బర్నబాస్‌ బింకం(శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా ఓంపూరు రమేష్‌ (శ్రీకాకుళం), కోశాధికారిగా పాస్టర్‌ ఎం.షక్ర్‌బాబు (రావాడపేట), ఉపాధ్యక్షులుగా పాస్టర్‌ జి.ఇ.శామ్యూల్‌ అరుణ్‌కుమార్‌(ఆమదాలవలస), పాస్టర్‌ టి.పేతురు(ఎచ్చెర్ల), సహాయ కార్యదర్శిగా పాస్టర్‌ ఆర్‌.శామ్యూల్‌ (కొయ్యాం), సహాయ కార్యదర్శిగా పాస్టర్‌ టి.సూరిబాబు (రణస్థలం), గౌరవాధ్యక్షులుగా పాస్టర్‌ ఇ.శామ్యూల్‌ జాన్‌ (సరుబుజ్జిలి), గౌరవ సలహాదారులుగా పాస్టర్‌ ఎ.ఎ.పాల్‌ (సొట్టవానిపేట), కార్యవర్గ సభ్యులుగా పాస్టర్‌ సీహెచ్‌.మోజేష్‌ (గార), పాస్టర్‌ కె.వి.జాషువ (పాతపట్నం), పాస్టర్‌ బి.చిన్నారావు (సారవకోట), ప్రచార కార్యదర్శిగా పాస్టర్‌ అల్లు ఇమ్మానుయేలు (లావేరు), ప్రేయర్‌ కో–ఆర్డినేటర్‌గా పాస్టర్‌ ఆశిర్‌ కుమార్‌ (ఆమదాలవలస), యూత్‌ వింగ ప్రెసిడెంట్‌గా పాస్టర్‌ అహరోన్‌ నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement