సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న ఎస్పీ జీఆర్ రాధిక
కంచిలి: రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ జీఆర్ రాధిక సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కంచిలి పోలీస్‌స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఇందులో పెండింగ్, విచారణలో ఉన్న కేసు ఫైల్స్‌ను పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. అనంతరం పోలీస్‌స్టేషన్ పరి సరాలు, శుభ్రతను పరిశీలించారు. దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి గస్తీలు పెంచాలన్నారు. మహిళల నేరాల్లో సత్వరమే స్పందించాలని తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుబడిన కేసు ప్రాపర్టీ వాహనాలను పరిశీలించారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం, సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ తనిఖీలో కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సోంపేట సీఐ రవిప్రసాద్, స్థానిక ఎస్‌ఐ బాలరాజు పాల్గొన్నారు.


