నోటికి నల్లరిబ్బన్లు కట్టి నిరసన తెలియజేస్తున్న బీసీ సంఘ నేతలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేంద్రం అమలు చేస్తున్న మహిళా బిల్లులో బీసీ/ఓబీసీలను చేర్చకపోవడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం నగరంలో జ్వోతిరావుపూలే పార్కులో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం బీసీలపట్ల మంచి హృదయంతో మహిళాబిల్లులో బీసీల సబ్‌కోటా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పిట్ట చంద్రపతిరావు, పిట్ట భాగ్యచంద్రరావు, కలగ జగదీష్ యాదవ్, కర్రి రంగాజీదేవ్, పసగాడ రామకృష్ణ, అడపాక రాంబాబు, తిప్పాన గాంధీ, ఎల్.నాగరాజు, సూరిబాబు, హేమసుందర్, కె.రమణ, ఎ.గోవింద్, అలపాన త్రినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


