మాట్లాడుతున్న ఎస్పీ రాఽధిక
శ్రీకాకుళం క్రైమ్ : ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ జి.ఆర్.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి కేంద్రం వద్ద ఐదుగురు పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులతో బందోబస్తు సిద్ధం చేయాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరిసరాల్లో ఇతరులు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. జెరాక్సు సెంట ర్లు తెరవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. సమావేశంలో అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వరరావు పాల్గొన్నారు.


