ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

బత్తలపల్లి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించేలా క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని హార్టికల్చర్‌ అదనపు సంచాలకులు శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం మండలంలోని గంటాపురం గ్రామంలో ప్రకృతి విధానంలో సాగైన పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలు, రైతులకు లభిస్తున్న ప్రయోజనాలు, పంట దిగుబడులు, మార్కెటింగ్‌ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంట ఉత్పత్తిని సాధించడంతోపాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. అంతకుముందు మండలంలోని సంజీవపురం, లింగారెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై రైతులకు వివరించారు. కరువు పరిస్థితులను అధిగమించేలా జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఉద్యాన తోటల్లో నీటి ఎద్దడి నివారణ ఫారం పాండ్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీ, అనంతరం వీడ్‌ మ్యాట్ల ఆవశ్యకతను విశదీకరించారు. చీనీ, మామిడి సాగు చేసిన రైతులు చెట్లకు రక్షక తడులు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, జిల్లా హార్టికల్చర్‌ అధికారి జయకుమార్‌, మండల వ్యవసాయాధికారి ఓబిరెడ్డి, హార్టికల్చర్‌ అధికారి శ్రీనివాసులు, ఏపీసీఎన్‌ఎఫ్‌ అధికారులు హరికుమార్‌, నరసింహులు, గంగమ్మ, హరీష్‌, అంబికా, అమృతరాణి, అనూష తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి

తాడిమర్రి: ఎల్‌నినో ప్రభావాన్ని నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు, అధికారుల సూచనలు పాటించాలని ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు శ్రీనివాసులు రైతులకు సూచించారు. బుధవారం ఆయన మండలంలోని పుల్లానారాయణపల్లి గ్రామంలోని చీనీ తోటలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement