ఎంపీటీసీలు లేకుండానే సన్మాన కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీలు లేకుండానే సన్మాన కార్యక్రమం

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు

అమడగూరు: ఎంపీటీసీల పదవీ కాలం ముగియడంతో బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ సన్మాన కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు బహిష్కరించారు. ఎంపీటీసీలు లేకపోయినా ఎంపీడీఓ శకుంతల టీడీపీ నేతలను పెద్ద ఎత్తున సమావేశానికి ఆహ్వానించి.. ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిని సన్మానించడం విమర్శలకు దారితీసింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న తాము లేకుండా ప్రభుత్వ ఖర్చుతో సన్మానాన్ని నిర్వహించడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై త్వరలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

సీడీపీఓపై ఆర్జేడీ విచారణ

ఓడీచెరువు: సీడీపీఓ గాయత్రి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై బుధవారం ఆర్జేడీ మనోరంజని బుధవారం విచారణ చేపట్టారు. సీడీపీఓ విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని మనోరంజని తెలిపారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఆర్జేడీతో పాటు పీడీ ప్రమీల పాల్గొన్నారు

గడువులోగా

రీసర్వే పూర్తి చేయండి

జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

పెనుకొండ రూరల్‌: నిర్దేశించిన గడువులోగా రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండలంలోని నాగళూరు, మావటూరు గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. రీ సర్వేలో భాగంగా తలెత్తుతున్న ఉమ్మడి జాయింట్‌ ఎల్‌పీఎం, పనుల పురోగతిపై సిబ్బందితో సమీక్షించారు. రైతులు ఎదుర్కొంటున్న జాయింట్‌ ఎల్‌పీఎం సమస్యలపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించాలన్నారు. రికార్డుల డిజిటలైజేషన్‌ పక్కాగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌ కుమార్‌, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ స్వాతి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement