కదిరిలో ఫ్లెక్సీ వార్‌ | - | Sakshi
Sakshi News home page

కదిరిలో ఫ్లెక్సీ వార్‌

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

బీజేపీ నేత విష్ణు ఫ్లెక్సీ చించివేత

టీడీపీ వర్గీయులపైనే అనుమానం

కదిరి టౌన్‌: కదిరి పట్టణంలో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీజేపీ జాతీయ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను చించివేయడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో టీడీపీ నాయకులే ఫ్లెక్సీలను చించేసి ఉంటారన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఆల్‌ సెల్స్‌ నేషనల్‌ జాయింట్‌ కోఆర్డినేటర్‌గా నియమితులైన విష్ణువర్ధన్‌రెడ్డి ఢిల్లీలో బాధ్యతలు చేపట్టి ఈ నెల ఐదో తేదీ కదిరికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను స్వాగతిస్తూ కదిరి పట్టణంలో బీజేపీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కుటాగుళ్ల ఆటో స్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. టీడీపీ వర్గీయులే ఈ పని చేసి ఉంటారని బీజేపీ నాయకులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య సోషల్‌ మీడియాలోనూ ‘వార్‌’ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement