విడపనకల్లు: ఉండబండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం నందివాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన నందివాహనంపై వీరభద్రస్వామి, భద్రకాళికాదేవి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. సాయంత్రం ఉత్సవమూర్తులను రథంలో ప్రతిష్ఠించారు. చీకలగురికి, పాల్తూరు, ఉండబండ, కరకముక్కల, పెద్ద కొట్టాలపల్లి, గాజుల మల్లాపురం, హావళిగి, ఉరవకొండ తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన బ్రహ్మరథోత్సవం మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.


