రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

కదిరి అర్బన్‌: కదిరిలోని ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల హిందూపురంలోని బసన్నపల్లి పాఠశాలలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలోనే కబడ్డీలో బీ.హయాత్నీ, హైజంప్‌లో బీ.రాజశ్రిత, ఖోఖోలో డీ.మానస, 800 మీటర్ల పరుగులో జీ.దీక్షిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి, పీఈటీ సుజాత, ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు.

ఏపీఆర్‌ఎస్‌ విద్యార్థులు..

పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ నరేంద్ర తెలిపారు. అండర్‌–17 విభాగంలో 100 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌లో సీ.హేమంత్‌, 800 మీటర్ల పరుగు పందెంలో వినిత్‌కుమార్‌, షాట్‌ పుట్‌లో అఖిల్‌, హైజంప్‌లో మోక్షిత్‌ కుమార్‌, ఖోఖోలో రామ్‌చరణ్‌ ఎంపికయ్యారన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీడీ ప్రసాద్‌, పీఈటీ షబానాను బుధవారం ప్రిన్సిపాల్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement