సమస్యలపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

పుట్టపర్తి: ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్‌ పేర్కొన్నారు. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బుధవారం డీఈఓ కిష్టప్పకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు, విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23(1)కు సవరణ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, సబ్జెక్టు టీచర్లకు సంబంధిత సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలనే డిమాండ్లతో మరోసారి పోరాటానికి సిద్ధమైనట్లు చెప్పారు. ఆగస్టు 14న కమిషనర్‌, మంత్రికి వినతిపత్రాలు అందజేత, 18న ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శులు అమర్‌, నారాయణరెడ్డి, బాబు, నాయకులు సునీల్‌కుమార్‌, వెంకట కిషోర్‌, రవి శేఖర్‌, రవీంద్రారెడ్డి, బ్రహ్మ, ఫకృద్దీన్‌, జగన్‌ తదితరులు ఉన్నారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

శెట్టిపి జయచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement