డీఈఈ కోర్సులో ప్రవేశానికి రెండోదశ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

డీఈఈ కోర్సులో ప్రవేశానికి రెండోదశ కౌన్సెలింగ్‌

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

పుట్టపర్తి: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఈ) కోర్సులో ప్రవేశానికి రెండోదశ కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టినట్లు బుక్కపట్నం డైట్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌. రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13 నుంచి 16 వరకూ ఆప్షన్ల నమోదు, ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకూ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. తరగతులు ఈనెల 27 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 17 ఏళ్లు నిండి ఉండాలని, ఇంటర్‌లో రిజర్వేషన్‌ వర్గాలకు 45 శాతం, ఇతర వర్గాల వారికి 50 శాతం మార్కులు ఉండాలన్నారు. అలాగే డీఈఈ సెట్‌లో ఓసీ, బీసీలకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 25 మార్కులు ఉండాలన్నారు. ఒకేషనల్‌ కోర్సులు చేసిన వారు అర్హులు కారన్నారు.

రూఫ్‌ టాప్‌ సోలార్‌ పనులు వేగవంతం చేయాలి

అనంతపురం టౌన్‌: రూఫ్‌ టాప్‌ సోలార్‌ పనులను వేగవంతంగా చేపట్టాలని ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి విద్యుత్‌ శాఖ అధికారులకు ఆదేశించారు. రాయలసీమ జిల్లాల విద్యుత్‌ అధికారులతో సీఎండీ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీడీసీఎల్‌ సంస్థ పరిధిలోని రాయలసీమ జిల్లాల్లో 50వేల రూఫ్‌టాప్‌ విద్యుత్‌ సర్వీసుల్లో నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై చేపడుతున్న సోలార్‌ పనులను వేగవంతంగా అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రూఫ్‌టాప్‌ సోలార్‌ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లతో చర్చించి, రోజువారి పురోగతి చూపాలని ఆదేశించారు.

సచివాలయాన్ని

ముట్టడించిన చేనేతలు

‘నేతన్న సేవ’లో అర్హులకు

అన్యాయం చేశారని ఆవేదన

ధర్మవరం: అర్హులకు ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేయకపోవడంపై చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు సంక్షేమ పథకం లబ్ధి చేకూర్చిన రాజకీయ నేతలపై మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్‌ కాలనీకి చెందిన పలువురు చేనేతలు వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆకుల రామలింగ ఆధ్వర్యంలో 27వ వార్డు సచివాలయాన్ని ముట్టడించారు. ‘నేతన్న సేవ’ పథకంలో అర్హులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సచివాలయాన్ని ఎదుటే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ...వార్డులో 136 మంది చేనేత కార్మికులు ఉండగా, వారికి ఎవరికీ ‘నేతన్న సేవ’లో పథకం వర్తింపజేయలేదన్నారు. సచివాలయ గ్రూప్‌ అడ్మిన్‌, టీడీపీ నాయకులు కుమ్మకై ్క అనర్హుల పేర్లు జాబితాలో చేర్చి లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. చేనేతల ధర్నా గురించి తెలుసుకున్న పోలీసులు సచివాలయం వద్దకు వచ్చి చేనేత కార్మికులకు సర్దిచెప్పారు. అంతేకాకుండా చేనేత కార్మికులతో దరఖాస్తులు తీసుకోవాలని సచివాలయ అడ్మిన్‌కు సూచించారు. దీంతో చేనేత కార్మికులు ధర్నా విరమించారు.

వైఎస్సార్‌సీపీ శాంతిర్యాలీపై అధికార పార్టీ అక్కసు

దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సహా

11 మంది నాయకులపై అక్రమ కేసు

పుట్టపర్తి: డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చాలని కోరుతూ యువత, డీఎస్సీ అభ్యర్థులతో కలిసి ఈనెల 10న శాంతియుత ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు 11 మందిపై పుట్టపర్తి పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో పాటు రవి నాయక్‌, ఓబుళపతి, ఏవీ రమణారెడ్డి, జి.గంగాద్రి, ఈశ్వరప్ప, తలమర్ల శ్యాం సుందర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కేశవ, లేపాక్షిరెడ్డి, జయప్ప తదితరులపై బీఎన్‌ఎస్‌ 189(2), 126(2), 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీఆర్‌ఓ ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ యువరాజ్‌ చెప్పారు. ఈ చర్యలను మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తప్పుపట్టారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించడం నేరమా అని ప్రశ్నించారు. ర్యాలీకి వచ్చిన స్పందన చూసి తట్టుకోలేని కూటమి ప్రజాప్రతినిధి ఆదేశాలతో అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అక్రమ కేసులకు బయపడేది లేదని, ఇందుకు చందబ్రాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement