మేము 25 ఎకరాల్లో మామిడితో పాటు నేరేడు, ఉసిరి, నిమ్మ, కొబ్బరి తదితర తోటలను సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడం, బోర్లలో నీరు రాక ఇప్పటికే 80 మామిడి చెట్లు పూర్తిగా ఎండిపోగా, వాటిని తొలగించాం. మరో 160 చెట్లు ఎండిపోయేలా ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యాన రైతులను ఆదుకోవాలి.
– గీతారాణి, పీవీకే పల్లి, తనకల్లు మండలం
నీరు ఉచితంగా
సరఫరా చేయాలి
మా గ్రామంలోని రైతులం వందల ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేశాం. వర్షాలు లేకపోవడంతో మామిడి తోటలతో పాటు ఇతర పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో అరకొర నీరు వస్తోంది. ఆ నీరు తోటలకు సరిపోవడం లేదు. ప్రభుత్వం ఉచితంగా ట్యాంకర్లతో తోటలకు నీటిని సరఫరా చేయాలి.
– భాస్కర్‌రెడ్డి, పెద్ద కడపలవాండ్లపల్లి, తనకల్లు మండలం


