13 నుంచి ఆర్జిత కల్యాణోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

13 నుంచి ఆర్జిత కల్యాణోత్సవాలు

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జ్జిత కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13, 16, 17, 18, 20, 23, 24, 25, 27, 30, 31 తేదీల్లో కలాణోత్సవాలు ఉంటాయన్నారు. ఆర్జ్జిత కల్యాణోత్సవ టిక్కెట్‌ రూ. 6,500గా నిర్ణయించామని, ఒక్కో టికెట్‌పై ఐదుగురిని అనుమతిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఖాద్రీ ఆలయంలో సంప్రదించవచ్చన్నారు. లేకపోతే ఆన్‌లైన్‌లోనూ కల్యాణోత్సవ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 9000490670, 9441860432 సంప్రదించాలన్నారు.

రేపటి నుంచి హెచ్‌ఐవీ నివారణపై విస్తృత ప్రచారం

ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఆగస్ట్‌ 12 నుంచి నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, సుఖవ్యాధుల నివారణపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం పీజీఈర్‌ఎస్‌ కార్యక్రమంలో పోస్టర్లను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంతో పాటు అవగాహన సమావేశాలు, కళాజాతాలు, ఎల్‌ఈడీ వ్యాన్ల ద్వారా వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ప్రజల్లో పూర్తి చైతన్యం వచ్చేలా ప్రచార కార్యక్రమాలు ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఫైరోజా బేగం, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, క్షయ నియంత్రణ అధికారి అనుపమ జేమ్స్‌, టీబీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రణయ్‌, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ వెంకటరత్నం పాల్గొన్నారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

ప్రశాంతి నిలయం: స్థానిక రెవెన్యూ భవన్‌ ఆవరణంలో సోమవారం 2026–27 సంవత్సర విద్యా విషయక క్యాలెండర్‌ను కలెక్టర్‌ ఏ. శ్యామ్‌ప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు ఈ క్యాలెండర్‌ను విధిగా అనుసరించాలన్నారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప, జిల్లా సాధారణ పరీక్షల మండలి కార్యదర్శి గోపాల్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement