డీఎస్సీలో ఉద్యోగం రాలేదని ఆవేదనతో నేను చనిపోతే దానికి మంత్రి లోకేష్, ఎమ్మెల్యే పల్లె సింధూరాదే బాధ్యత. 8 నెలలుగా తీవ్ర మనోవేదనతో నా ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, విద్యాశాఖ కమిషనర్, మంత్రి లోకేష్, చంద్రబాబును కలిసి నా బాధను విన్నవించుకున్నా. ఎవరూ న్యాయం చేయలేదు. గుంతకల్లులో ఓ అభ్యర్థికి అక్కడి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పుట్టపర్తి ఎమ్మెల్యే ఇప్పటి వరకూ కనీసం ఓదార్చిన సందర్భం కూడా లేదు. ఇప్పటికై నా నాకు దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇవ్వాలి. నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి అన్యాయానికి గురైన ప్రతి అభ్యర్థికీ న్యాయం చేయాలి.
– అంజినప్ప, డీఎస్సీ అభ్యర్థి,
టి.కుంట్లపల్లి, ఓడీచెరువు మండలం


